జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జెడ్పీ డిప్యూటీ సీఈవోని పిలిపించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెడతారని ప్రశ్నించారు.. జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.