విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన జానపదాల్లో అనేకం మేటి చిత్రాలుగా నిలిచాయి. వాటిలో యన్టీఆర్ హీరోగా కేవీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుని కథ’ జనం మెచ్చే కథ,కథనంతో పాటు సంగీతసాహిత్యాలతోనూ అలరించింది. ఈ చిత్రం ఆగస్టు 9తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1961 ఆగస్టు 9న విడుదలైన ‘జగదేకవీరుని కథ’ చిత్రం అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. యన్టీఆర్ – కేవీ రెడ్డి హ్యాట్రిక్!యన్టీఆర్ ను…