దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా అరెస్ట్ తరువాత ఆయన తెగకు చెందిన జులూ వర్గీయులు రెచ్చిపోతున్నారు. జోహెన్స్‌బర్గ్, డర్భన్‌లో లూటీలకు పాల్పడుతున్నారు. జాకోబ్ జుమా అవినీతికి, ఆయన పదవి కోల్పోవడానికి, అరెస్ట్ కావడానికి భారత్‌కు చెందిన గుప్తా బ్రదర్స్ కారణమని ఆరోపణలు వస్తుండటంతో జులూ తెగకు చెందిన వ్యక్తులు భారతీయులకు చెందిన ఆస్తులను దోచుకుంటున్నారు. వారికి సంబంధించిన వ్యాపారసంస్థలను కొట్లగొడుతున్నారు. ఒక్క డర్భన్‌లోనే భారతీయులకు చెందిన 50 వేల వ్యాపారసంస్థలపై దాడులుచేసి లూటీ చేశారు. జోహెన్స్‌బర్గ్‌లో…
దక్షిణాఫ్రికాలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లరి మూకలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర సమరయోధుడు నెల్సన్ మండేలా స్పూర్తితో అప్పట్లో దక్షిణాఫ్రికా స్వాతంత్రపోరాటంతో పాల్గొని తరువాత రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎదిగిన జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు. వీరి మూలాలు ఇండియాలోనే ఉండటం విశేషం. యూపీలోని సహరాన్‌పూర్ సమీపంలోని ఓ…