పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. తాజాగా జాకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది.…