AP Private Bus Accidents: ఏపీలో ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. గత15 రోజుల్లో రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో బస్సు ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. గతంలో అడపా దడపా ప్రమాదాలకి గురయ్యే ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయాయి. ఈ బస్సుల్లో ప్రయాణానికి గ్యారెంటీ లేకుండా పోయింది. మొన్న కర్నూలు దగ్గర కావేరి ట్రావెల్స్ 19 మందిని బలి తీసుకుంది.
Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు.