కొడుకు.. కూతురు.. అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. వాళ్లతో అక్రమ దందా చేయించింది. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కొడుకును.. తాను చేసే కంత్రీ పనుల్లో భాగం చేసింది. ఇల్లు చక్కదిద్దుకోవడమెలా అని నేర్పించాల్సిన కూతురికి ఇల్లీగల్ పనులు అప్పజెప్పింది. పేదింటి మహిళలతో తప్పుడు పనులు చేయిస్తూ… డబ్బులు వెనకేసుకుంది. ఇంతకూ ఎవరా కిలేడీ…? మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే అంశాలేంటి..? Also Read:Shubhanshu Shukla: ప్రధాని మోడీని కలిసిన శుభాన్షు శుక్లా..…
మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఏపీ చిలకలూరిపేట కి చెందిన లక్ష్మీ రెడ్డి పై 2024 లో ముంబై లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీ రెడ్డి.. కొడుకు నరేందర్ రెడ్డి, కూతురు తో కలిసి మరో దందాకు తెరలేపింది. మాదాపూర్, అమీర్‌పేట, RTC x రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు ఏర్పర్చుకుంది. అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు…
సరోగసీ ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సాగించిన మోసాలు అన్ని ఇన్ని కావు. గత కొన్ని రోజులుగా సృష్టి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సృష్టి తరహాలో మేడ్చల్‌లో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్లపై పోలీసుల దాడి చేసి అసలు గుట్టు రట్టు చేశారు. క్లినిక్‌ల ముసుగులో అక్రమంగా సరోగసి చేస్తున్న 6 క్లినిక్‌లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న భార్య భర్తలను…
కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం ఒక ఉత్తేజకరమైన ప్రయాణం, కానీ కొంతమందికి, ఇది సవాళ్లతో కూడా రావచ్చు. మీరు గర్భం ధరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడం మీ మాతృత్వ కలను సాధించడానికి కీలకమైన దశ. సంతానోత్పత్తి నిపుణుడి సహాయం పొందే సమయం కావచ్చు అనే కొన్ని ముఖ్య సూచికలు ఇక్కడ ఉన్నాయి.
Eggs Freezing : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం స్త్రీకి అంత సులభం కాదు. తల్లిగా మారడం మరింత కష్టం అవుతుంది. చాలామంది మహిళలు తల్లులు కావడానికి తమ వృత్తిని వదిలివేయవలసి ఉంటుంది. మహిళలు తన కెరీర్‌ను పణంగా పెట్టి తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు మహిళా సెలబ్రిటీలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ టెక్నిక్ ని అవలంబిస్తున్నారు. తద్వారా ఆమె తన కెరీర్‌కు విరామం తీసుకోనవసరం లేదు. అలాగే వారు…
IVF Case: దివంగత పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి ఇటీవల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది. అయితే, 21-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అర్హులనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022లో పంజాబ్ మాన్సాలో 28 ఏళ్ల సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు.…
COVID-19: 2019 చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని మొత్తం వ్యాపించింది. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో లక్షల్లో మరణాలకు కారణమైంది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.
ఇటీవల కాలంలో దేశంలో ఐవీఎఫ్ విధానం బాగా పాపులర్ అయింది. పిల్లలు లేనివారు ఈ పద్దతి ద్వారా పిల్లను కంటున్నారు. అండాలను, శుక్రకణాలను సేకరించి ప్రత్యేక పద్దతితో ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి ఆ తరువాత అ అండాన్ని వేరొకరి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అక్కడ అండం పిండంగా మారుతుంది. ఇప్పుడు ఈ కృత్రిమ పద్దతి విధానాన్ని అరుదైన జంతువుల జాతిని పెంచేందుకు కూడా వినియోగిస్తున్నారు. దేశంలో అత్యంత అరుదైన జాతికి చెందిన పశువుల్లో పుంగనూరు జాతి ఆవులు కూడా…