Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాజధానిలో ఆదివారం ఉదయం మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి పరిస్థితులు తలెత్తాయి.
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. మేఘాలకు చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇటానగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.