ISSF World Championships: భారత షూటర్ సామ్రాట్ రాణా (Samrat Rana) ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతో.. ఈ విభాగంలో వ్యక్తిగతంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా అతడు నిలిచాడు. తన మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడిన సామ్రాట్ రాణా 243.7 పాయింట్ల స్కోర్ సాధించాడు. చైనాకు చెందిన హు కై (Hu Kai) కంటే 0.4…