Israeli Strike On Syria: ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు అతని డిప్యూటీతో పాటు మరో ఇద్దరు గార్డ్స్ సభ్యులు శనివారం మరణించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో.. సిరియా రాజధానిపై జరిగిన స్ట్రైక్స్‌లో నలుగురు సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది.