ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా తన మరణానికి ముందు ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాడని లెబనాన్ మంత్రి తెలిపారు. లెబనీస్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ మాట్లాడుతూ.. వైమానిక దాడిలో మరణించడానికి కొద్ది రోజుల ముందు నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని వెల్లడించారు.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. గత వారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడుగా పోతుంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థపై దెబ్బకొట్టగా.. అటు తర్వాత రాకెట్లకు పని చెప్పింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందల మంది చనిపోయారు.
10 నెలల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తుల చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ గాజాపై మరోసారి భీకర దాడులు జరిగాయి. జవైదా పట్టణంపై టెల్‌అవీవ్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మృతి చెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. దాడిలో వ్యాపారి అయిన సమీ జవాద్ అల్-ఎజ్లా, అతడి ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, మరో నలుగురు బంధువులు ప్రాణాలు కోల్పోయినట్లు అల్-అక్సా…
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పాలస్తీనా అథారిటీ మాజీ మంత్రి మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్-మఘాజీ శరణార్థి శిబిరంపై జరిగిన సమ్మెలో పాలస్తీనా అథారిటీలోని మత వ్యవహారాల మాజీ మంత్రి 68 ఏళ్ల యూసఫ్ సలామా మరణించినట్లు వఫా వార్తా సంస్థ, మంత్రిత్వ శాఖ నివేదించాయి.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి తెగబడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశంచి చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా అత్యంత పాశవికంగా హత్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్నారుల తలలను నరికేశారు. ఈ దాడుల్లో 1400 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.