Justin Trudeau: కెనడా ప్రధాని తన తీరు మార్చుకోవడం లేదు. ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇందులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కారణంగా ఇరు దేశాల మధ్య ఎప్పుడూ లేనంతగా దౌత్యవివాదం చెలరేగింది. అయితే ఈ వ్యాఖ్యలకు ఆరోపణలు చూపించాల్సిందిగా ఇండియా కోరితే మాత్రం అటు నుంచి స్పందన రావడం లేదు.
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్‌లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది.
US Stock Market: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. యుద్ధం కారణంగా ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభమైంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల మార్పిడికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఉగ్రవాద గ్రూపులోని ఒకరు తెలిపినట్లు తెలిసింది. అమెరికా మద్దతుతో, ఖతార్ ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటోంది.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపై చేసిన క్రూరమైన దాడులను ఖండించిన ఒక రోజు తర్వాత, సోమవారం పాలస్తీనియన్లకు మద్దతుగా కాంగ్రెస్ బహిరంగంగా ముందుకు వచ్చింది.
హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్‌ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.