Taliban Publicly Execute Murder Accused, First After Afghanistan Takeover: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగ మరణశిక్షను విధించింది. హత్య నిందితులను బహిరంగంగా శిక్షించింది. పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో 2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నోఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. షరియానూ అమలు చేస్తున్నారు.