Iran Nuclear Site: ఇజ్రాయెల్ చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట నిర్వహించిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణుశక్తి కేంద్రాల్లో సంభవించిన నష్టాన్ని స్పష్టంగా చూపించే ఉపగ్రహ చిత్రాలను మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఈ చిత్రాలలో నాటాంజ్, ఫోర్డో ఇంకా ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన దాడుల ముందు, తర్వాత పరిస్థితుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులలో నాటాంజ్ అణు కేంద్రం పైభాగంలోని కీలక నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, అంతర్జాతీయ అణు…