Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.