తమిళ స్టార్ హీరో సూర్యది పెద్ద మనసు. ఆయన తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా కథానాయకుడే! నటుడిగా కోట్లాది మంది మనసుల్ని దోచుకునే సూర్య, అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సూర్య ‘జై భీమ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాదు…. అందులో గిరిజనుల పక్షాన నిలిచి పోరాడే చంద్రు అనే లాయర్ పాత్రనూ పోషించాడు. ఈ నెల 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా…