Uttam Kumar Reddy : హుజూర్నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే…