ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు.