ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ డెవలప్మెంట్ జరగబోతుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టుని సిట్ ఆశ్రయించబోతుంది.. నాలుగు సార్లు ప్రభాకర్ రావు విచారించిన తమకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ చెప్పబోతుంది.. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ని వెంటనే రద్దుచేసి కస్టోడియల్ ఎంక్వయిరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంను సిట్ కోరే అవకాశం ఉంది.. ఇందుకు సంబంధించి పావులను సిట్ కరూపుతుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.