ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్‌లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి. ఇందులో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అంశాల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు సాధించడం ఒకటి. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో నిలిచిపోయేలా మారాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా అంతే.. ఈ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ ఊచకోత కోశాడు.
గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. తన భారీ ఇన్నింగ్స్‌ల కారణంగా గుజరాత్ ఈ రోజు టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా సాయి సుదర్శన్ సన్ రైజర్స్ పై ఊచకోత కోశాడు. 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో శతకొట్టాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సాయి సుదర్శన్ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేడుకున్నాడు.