ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్‌లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి. ఇందులో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అంశాల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు సాధించడం ఒకటి. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో నిలిచిపోయేలా మారాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా అంతే.. ఈ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ ఊచకోత కోశాడు. చివరి రెండు ఓవర్‌లో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 14 బాల్స్‌లో అర్ధశతకం పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్, పాట్ కమ్మిన్స్ తర్వాత 14 బాల్స్‌లో అర్ధశతకం సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
READ MORE: Off The Record: వైసీపీలోకి తిరిగి వెళ్లడానికి ఇగో అడ్డొస్తుందన్న నేత ఎవరు? ఏంటా పరిస్థితి?
కాగా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)పై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేఎల్ రాహుల్, పాట్ కమ్మిన్స్ వరుసగా 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. తాజాగా రొమారియో షెపర్డ్ వీళ్ల అంచున చేరాడు.
READ MORE: RCB vs CSK: రఫ్పాడించిన ఆర్సీబీ బ్యాటర్లు.. కింగ్ కోహ్లీ, షెపర్డ్, బెతెల్ తుఫాను ఇన్సింగ్స్!