Home
Ipl 2024
Ipl 2024 News
-
Riyan Parag: ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ చరిత్ర.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్దలు!
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో రియాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి… -
RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
CSK Player Tushar Deshpande Trolls RCB: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఆర్‌సీబీ ఓటమితో ఆ జట్టు ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీను… -
RCB vs RR: ఆ ఇద్దరి వ్యూహాల కారణంగానే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచాం: సంజూ శాంసన్
Sanju Samson Hails Shane Bond and Kumar Sangakkara: హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాలతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అన్ని విషయాలను చర్చిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు తమతో హోటల్ గదుల్లో చాలా సమయం గడిపారన్నాడు. అందరూ బాగా ఆడారని, తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం అని సంజూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో… -
RCB vs RR: అదే మా కొంపముంచింది: ఫాఫ్ డుప్లెసిస్
Faf du Plessis Says Extremely proud our RCB Team: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 20 పరుగులు తక్కువగా చేయడమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తమ కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారని, గెలుపు కోసం ఆఖరి వరకు సాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించారు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరడం సంతోషాన్ని ఇచ్చిందని, కానీ ఎలిమినేటర్‌లో ఓడడం బాధగా ఉందని ఫాఫ్ తెలిపాడు.… -
Glenn Maxwell: ఐపీఎల్ చరిత్రలోనే గ్లెన్ మాక్స్‌వెల్ అత్యంత చెత్త రికార్డు!
Glenn Maxwell Unwanted Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా ఆర్‌సీబీ మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్‌తో కలిసి మ్యాక్సీ సమంగా నిలిచాడు. ఐపీఎల్‌లో డీకే, మాక్స్‌వెల్ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్… -
Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 17 ఏళ్ల ఐపీఎల్‌లో మొదటి క్రికెటర్!
RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక… -
Dinesh Karthik Retirement: ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్ గుడ్ బై!
Happy Retirement DK Tag Trend in X: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో… -
RCB vs RR: రాజస్థాన్ చేతిలో ఓటమి.. ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు ఔట్!
RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8×4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2×4,… -
RR vs RCB: తడబడి తేరుకున్న ఆర్సీబీ.. ఆర్ఆర్ టార్గెట్ 173..
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ బాటింగ్ దిగగా మొదట్లో బాగానే ఆడిన మందలో కాస్త వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివరకు నిర్ణిత… -
RR vs RCB: టాస్ గెలిచి ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించిన రాజస్థాన్ రాయల్స్..
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు సంబంధించి టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలవగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ హిస్టరీలో 30 మ్యాచ్లు ఆడగా అందులో రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచులు విజయం…
తాజావార్తలు
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!