Sanju Samson Hails Shane Bond and Kumar Sangakkara: హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాలతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అన్ని విషయాలను చర్చిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు తమతో హోటల్ గదుల్లో చాలా సమయం గడిపారన్నాడు. అందరూ బాగా ఆడారని, తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం అని సంజూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ 2024 ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్స్ తలపడుతుంది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘కొన్ని మంచి, కొన్ని చెడు దశలు ఉంటాయని క్రికెట్, జీవితం నేర్పించాయి. బౌన్స్ బ్యాక్ అయ్యే క్యారెక్టర్ మనకు ఉండాలి. ఈరోజు మా జట్టు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం క్రెడిట్ బౌలర్లదే. మా బౌలర్లు ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ.. ఫీల్డ్ సెటప్ చేసుకుని బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్‌కు దక్కుతుంది. హోటల్ రూమ్స్‌లో గంటలకొద్ది మాతో చర్చిస్తూ వ్యూహాలు రచిస్తారు’ అని తెలిపాడు.
Also Read: RCB vs RR: అదే మా కొంపముంచింది: ఫాఫ్ డుప్లెసిస్
‘ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ అనుభవజ్ఞులు. వారికి ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. 22 ఏళ్ల వయసున్న రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీరికి అనుభవం తక్కువగా ఉన్నాయి.. ఈ స్థాయిలో రాణిస్తున్న తీరు అద్భుతం. నిజానికి నేను 100 శాతం ఆరోగ్యంగా లేను. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైరస్ ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది దగ్గు, అస్వస్థతతో బాధపడుతున్నారు. రోవ్‌మన్ పావెల్ అద్భుతంగా మ్యాచ్‌ను ముగించాడు. క్వాలిఫయర్ 2 మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రయాణం అనంతరం విశ్రాంతి తీసుకుని సిద్ధం కావాలి’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.