ఐపీఎల్‌లో అసలు సమరం మొదలవుతోంది. లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్ పైట్‌కు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్, కోల్‌కతాల్లో ఎవరు తుది సమరంలో తలపడతారోననే ఆసక్తి నెలకొంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఆటలో అసలు మజాకు వేళైంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఢిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు,…