న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పోలీసు స్టేషన్‌లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది.