Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్‌లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్‌కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్‌పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది.