కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసిన విషయం విదితమే! వారం రోజులు అవుతున్నా, ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించలేదు. దీంతో ఉద్యోగులు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. వారం రోజులైనా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్‌లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే…