సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్‌లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్‌లోనే డైరెక్ట్‌గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19…
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్రమాదం తప్పింది. రష్యాకు చెందిన వ్యోమనౌక రీసెర్చ్ మాడ్యూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు. డాక్ చేసిన కొన్ని నిమిషాల తరువాత హతాత్తుగా మాడ్యూల్‌కి చెందిన థ్రస్టర్స్ ఫైర్ అయ్యాయి. దీంతో అంతరిక్ష కేంద్రం కొంతమేర అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు లోపాన్ని సవరించారు. దీంతో అంతరిక్ష కేంద్రం తిరిగి యధాస్థితికి వచ్చింది. డాక్ చేసిన తరువాత కంప్యూర్స్‌లో అప్‌డేట్ కాకపోవడంతో…
ఈ విశ్వం గురించి ఎంత పరిశోధనలు చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు, పరిశోధించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. భూమిని పోలిన గ్రహాలు ఈ విశ్వంలో అనేకం ఉండోచ్చు. వాటి గురించి నాసా వంటి సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, అంతరిక్షంలో నాసా, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ అంతరిక్ష కేంద్రంలో నాసా అనేక ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నది. అక్కడ ఉండే…