అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్‌నే కారణమంటూ అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిందంటూ వార్తలు వండి వార్చాయి.
భారత సైన్యం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ తీవ్రంగా కృంగిపోయింది. రోజురోజుకూ ఓటమి వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. ఇప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ సైన్యం కొత్త అబద్ధాలను పుట్టిస్తోంది. అయితే.. శనివారం మరో కొత్త దుష్ర్పాచారం చేసింది. ఢిల్లీ విమానాశ్రయంపై క్షిపణితో విజయవంతంగా దాడి చేశామని, ఈ దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని పాకిస్థాన్ పేర్కొంది.
భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు.