52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతోంది. ఈ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ‘నాట్యం’ను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ నాట్యాచారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రంలో నాయికగా నటించి, నిర్మించారు. అక్టోబర్ 22న ఈ సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని కమిటీ ఇఫీకి…