Israel Hamas War : గాజాకు దక్షిణంగా ఉన్న రఫా నగరంలో సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి (UN) అత్యున్నత న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.
రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి.
ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ సంస్థ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సోమవారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)పై క్షిపణి దాడి చేస్తామని బెదిరించారు.