విశాఖపట్నంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు సంచలనం రేపుతోంది. జూలై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహా ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం మిస్టరీగా మారింది.