Asaduddin Owaisi : పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం…
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.