ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును…