ఏ సమస్యైనా, సంక్షోభమైన ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా తాలిబన్లపై తాను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు కనిపించడం లేదంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, చైనాకు చెందినవారు తన ఇన్‌స్టా ఖాతాను హ్యాక్ చేసినట్లు అలర్ట్ వచ్చిందని తెలిపింది. దీంతో నిర్వహాకులకు ఫిర్యాదు…