Tollywood : ఎగ్జిబిటర్స్ vs గిల్డ్ నిర్మాతల వివాదం.. నేడు పవర్ స్టార్ తో గిల్డ్ నిర్మాతలు కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా సద్దుమణగలేదు. థియేటర్స్ ని రెంట్ బేస్ మీద నడపలేమని, మొదటి రోజు నుండే తమకు షేర్ పర్సెంట్ విధానం ఉండేటివంటి పలు కీలక అంశాలపై ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నప్పటికీ ఇంకా ఒక స్పష్టమైన ముగింపు రాలేదు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఇరు వర్గాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ఇందులో భాగంగా నిన్న థియేటర్ల ఎగ్జిబిటర్స్ ప్రతినిధి బృందం మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం అత్యవసరంగా భేటీ కానుంది. ఇండస్ట్రీలోని ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో నిర్మాతలు పవన్ కళ్యాణ్‌కు ఒక అధికారిక వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చొరవ చూపాలని డిప్యూటీ సీఎంను కోరనున్నారు. ఈ భేటీ తర్వాత టాలీవుడ్ థియేటర్ల వివాదానికి ఒక స్పష్టమైన పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
- Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
- Adipurush: 'ఆదిపురుష్' నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
- Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!