మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. ‘అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.…