రేపటి (బుధవారం ) నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు.
Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు…
Vijayawada: విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణలకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తరువాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7లక్షల మంది వరకు భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభం…
Vijayawada: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం, భక్తులు తలనీలాల సమర్పణ ద్వారా రూ.6.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.2.48 కోట్లు, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.5 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం లభించింది. కాగా గత…