భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్) 35 వేల ఏకే-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కింద తయారైన ఈ రైఫిల్స్ సైన్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం సమీకరించిన కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేశారు.