Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు…