రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో 15 భారతీయ కంపెనీలతో సహా 275 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా తన యుద్ధ యంత్రాంగానికి ఈ కంపెనీలు మద్దతు తెలిపాయని ఆరోపించింది.