మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 (రిజిస్ట్రీ VT-IMD) మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఢిల్లీ, శ్రీనగర్ మధ్య విమానంపై వడగళ్ల వర్షం పడింది. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. విమానంపై పిడుగు కూడా పడిందని చెబుతున్నారు. పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు.