Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Bitra island: భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. Read Also: Honeymoon: హనీమూన్ కోసం…