పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌లో విజయం సాధించి పారిస్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది.