న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 'ది ఇండియా సెంచరీ' గురించి మాట్లాడారు. ఇంటరాక్షన్ సందర్భంగా భారతదేశ విదేశాంగ విధానం, ప్రపంచవ్యాప్త పాత్రను ఎలా పోషిస్తోంది అనే దానిపై వివరాలను వెల్లడించారు. రష్యాతో భారత్ సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు రష్యా వెళ్తున్నారని తెలిపారు.