India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.