Smriti Mandhana Wedding: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నవంబర్ 20న వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలుసా.. నటుడు-గాయకుడు-దర్శకుడు-సంగీతకారుడు పలాష్ ముచ్చల్ అని కథనాలు వెల్లడించాయి. స్మృతి మంధానకు బాలీవుడ్ నటుల కంటే తక్కువ అభిమానుల ఫాలోయింగ్ ఏం లేదు. ఆమె అందాన్ని ప్రశంసించడంలో ప్రజలు ముందు ఉంటారు. అలాగే ఆమె టీమిండియా మహిళా జట్టులో అత్యంత ముఖ్యమైన క్రీడాకారిణులలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.…