Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి.