Indian Marriages: పెళ్లైన భారతీయుల్లో 60 శాతం మంది వివాహేతర సంబంధాలపై ఇంట్రెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. జనరల్గా భారతీయ సమాజం ఒక భార్య, ఒక భర్త విధానానికి కట్టుబడి ఉంటుంది. కానీ, ప్రాశ్చాత్య దేశాల అలవాట్లు మెల్లగా భారతీయ సమాజంలోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో భారతీయులు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారనే విషయాన్ని ఈ యాప్ తన రిసెర్చ్ లో తెలిపింది. దాదాపు 60 శాతం మంది భారతీయులు వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికలో భాగంగా టైర్ 1, టైర్ 2 సిటీల్లో నివసించే 1503 మంది నుంచి ఈ సమాచారాన్ని సేకరించి యాప్ పరిశోధకులు అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన పురుషులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది.
Read Also: Election Commissioner: నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక.. ప్రధాని మోడీతో కీలక భేటీ
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే, భారతీయ సమాజంలో వివాహా బంధానికి ప్రత్యేక ఉంది. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉండాల్సిందే అనే కట్టుబాట్లు ఉన్నాయి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటూ కుటుంబ వ్యవస్థను అద్భుతంగా లీడ్ చేసే భారతీయుల్లో.. పెళ్లి అనే బంధంపై తాజాగా ఆలోచన మారుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న చాలా మంది వృత్తిపరమైన, ఇతర ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ అయ్యేందుకు, సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాలు వైపు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొనింది. ఏది ఏమైనా తాజా అధ్యయనం ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాల గురించి తెలియజేస్తుంది. 46 శాతం మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఈ తరహా సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు.
Read Also: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..
పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్ విధానంలో రిలేషన్స్ కొనసాగిస్తున్నట్లు తేలింది. కాగా, ఇప్పటి వరకు భారతీయ వివాహ బంధంలో ఉన్న గొప్పతనం గురించి తెలిసిన అందరికీ.. తాజా నివేధికలోని అంశాలు కొంత ఆశ్చర్యాన్నికి గురి చేస్తున్నాయి. ఈ అధ్యయనంపై గ్లీడెన్ కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ మాట్లాడుతూ.. ఈ పరిశోధనలో భాగంగా అనేక విషయాలను తెలుసుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!