ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేస్తే.. బెంగాలీ సింగర్ రూపాంకర్ బాగ్చీ మాత్రం ‘ఎవరీ కేకే’ అంటూ అక్కడ వెళ్లగక్కాడు. ప్రాంతీయ సింగర్‌లను ప్రోత్సాహించాలంటూ.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో, అతనికి సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. నెట్టింట్లో నెటిజన్లు దుమ్మెత్తిపోశాడు. దీంతో తన తప్పు తెలుసుకున్న రూపాంకర్.. తాజాగా క్షమాపణలు తెలిపాడు. ఈ విషయంపై ప్రెస్‌మీట్ నిర్వహించి, బహిరంగంగా సారీ చెప్పాడు. తాను పోస్ట్ చేసిన…