ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో అక్కడ మెడికల్ విద్యనభ్యసిస్తున్న వేలాదిమంది తిరుగుముఖం పట్టారు. మనదేశంలో వారందరికీ విద్యను పూర్తిచేసే అవకాశం వుంటుందా? విద్యార్థుల భవిష్యత్తేంటి..? అందరికి సీట్లు సర్దుబాటవుతాయా? భవిష్యత్తులో ఉక్రెయిన్ లో చదివే అవకాశం వుంటుందా? అయిందంతా పోసి వారిని అక్కడికి పంపారు. ఏజెన్సీలు ఊదరగొట్టి మరీ చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పంపారు. వందలాదిమంది తెలంగాణ విద్యార్ధులు 700మందికి పైగా ఆపరేషన్ గంగలో ఇక్కడికి తెచ్చారు. కేంద్రంతో మాట్లాడి వారికి అయ్యే ఖర్చు తామే…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్. ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్…
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ…